రెండోసారి పెళ్లి వేడుకలో సినిమా స్టయిల్లో డ్యాన్స్ చేసిన పాండ్యా దంపతులు.. వీడియో ఇదిగో!
- తన భార్య నటాషాను మరోసారి పెళ్లి చేసుకున్న హార్దిక్
- ఉదయ్ పూర్ కోటలో అంగరంగ వైభవంగా వేడుక
- హాజరైన కుటుంబ సభ్యులు, సన్నిహితులు
పెళ్లి వేడుకలో దంపతులిద్దరూ చాలా హుషారుగా కనిపించారు. పెళ్లి మండపానికి ఇద్దరూ సినిమా స్టయిల్లో డ్యాన్ చేస్తూ వచ్చారు. సాయంత్రం పూట పూల బొకేలు పట్టుకొని పలువురు మహిళలు వెంటరాగా.. తెల్లటి మ్యాట్ పై ఇద్దరూ ముందుకు సాగారు. పాండ్యా అదిరిపోయే స్టెప్పులు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.