గర్భవతి అయ్యిందనే వార్తలపై సింగర్ సునీత స్పందన
- రెండేళ్ల క్రితం రామకృష్ణను రెండో వివాహం చేసుకున్న సునీత
- సునీత ప్రెగ్నెంట్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం
- నేను గర్భవతి అనే విషయం నాకే తెలియదే అన్న సునీత
ఈ క్రమంలో తాజాగా ఆమె గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. సునీత మళ్లీ గర్భవతి అయింది అనేదే ఆ వార్త. ఈ వార్తపై సునీత స్పందిస్తూ... 'ఔనా.. నేను ప్రెగ్నెంట్ అనే విషయం నాకు తెలియదే' అని సరదాగా వ్యాఖ్యానించింది. ఈ వార్త తనకు గానీ, తన జీవితానికి కానీ సంబంధించినది కాదని తెలిపింది. ఇలాంటి రూమర్లను సృష్టించిన వారి ఆలోచన స్థాయికి చెందినదని విమర్శించింది.