Urvashi Rautela: సౌత్ సినిమాను తనవైపుకు తిప్పుకుంటున్న ఊర్వశి రౌతేలా!

Urvashi Rautela Special
  • బాలీవుడ్ బ్యూటీగా ఊర్వశి రౌతేలా 
  • 'వాల్తేరు వీరయ్య' ఐటమ్ తో సందడి 
  • సౌత్ సినిమాలపై చూపుతున్న ఆసక్తి 
  • 'కాంతార 2'లో లభించిన ఛాన్స్ 
  • హీరోయిన్ గా టాలీవుడ్ లోను అడుగుపెట్టే అవకాశం
ఊర్వశి రౌతేలాకి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఆమె ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి చేసిన సినిమాలు తక్కువే. అయితే సోషల్ మీడియా ద్వారా తన అభిమానుల సంఖ్యను .. ఆరాధకుల సంఖ్యను పెంచుకోవడమే ఎక్కువ. 

ఊర్వశి ఒక గ్లామర్ డాల్ మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. అజంతా శిల్పంలా అందంగా చూపించడానికి మాత్రమే ఆమెను తీసుకుంటూ ఉంటారు. అందువల్లనే అభినయానికి కాస్త దూరంగానే ఆమెకు పాత్రలు లభిస్తూ వచ్చాయి. అలాంటి ఊర్వశికి తెలుగులో 'బాస్ పార్టీ' సాంగ్ తో పాప్యులారిటీ అమాంతంగా పెరిగిపోయింది. 

ఈ నేపథ్యంలోనే కథానాయికగాను సౌత్ లో నిలబడాలనే ఉద్దేశంతో ఊర్వశి ఉందనే విషయం అర్థమవుతోంది. అందువల్లనే 'కాంతార 2' నుంచి ఛాన్స్ రాగానే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మేకర్స్ కంటే ముందుగానే ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వదిలింది. రిషబ్ శెట్టితో కలిసి ఈ సినిమాలో ఆమె సందడి చేయనుంది. ఇక సౌత్ లోని మిగతా భాషల్లోను బిజీ కావాలనే ఉత్సాహంతో ఆమె ఉందనే టాక్ బలంగానే వినిపిస్తోంది. హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందనేది చూడాలి మరి.
Urvashi Rautela
Actress
Bollywood

More Telugu News