Dhanush: ధనుశ్ గురించి సంయుక్త మీనన్ ఏం చెప్పిందంటే..! 

Samyuktha Menon Interview
  • సంయుక్త మీనన్ కి పెరుగుతున్న అవకాశాలు 
  • ఆల్రెడీ తెలుగులో రెండు భారీ హిట్లు 
  • ద్విభాషా చిత్రంగా విడుదలవుతున్న 'సార్'
  • ధనుశ్ సరసన నటించడం అదృష్టమన్న సంయుక్త 
  • లైన్లో సాయితేజ్ 'విరూపాక్ష'   

సంయుక్త మీనన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే 'భీమ్లా నాయక్' ..'బింబిసార' వంటి హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత ఆమె చేసిన సినిమానే 'సార్'. తమిళంలో ఈ సినిమాకి 'వాతి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ రెండు భాషల్లోనూ ఈ సినిమా ఈ నెల 17వ తేదీన విడుదల కానుంది. 

ఈ నేపథ్యంలో తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంయుక్త మీనన్ మాట్లాడుతూ .. "నేను 'భీమ్లా నాయక్' సెట్ లో ఉండగానే, 'సార్' ప్రాజెక్టు ప్రస్తావన వచ్చింది. ధనుశ్ సినిమాలో ఛాన్స్ .. పైగా ద్విభాషా చిత్రం .. అందువలన ఎంతమాత్రం ఆలోచించకుండా ఈ సినిమాను ఒప్పుకున్నాను" అన్నారు.  

"ధనుశ్ గొప్ప స్టార్ .. మంచి నటుడు. ఆయనతో కలిసి నటించడం అంత తేలికైన పనేం కాదు. ఇక ఈ సినిమాలో నా పాత్రలో కాస్త రొమాంటిక్ యాంగిల్ ఉన్నప్పటికీ, ఫినిషింగ్ టచ్ ఎలా ఉంటుందనేది ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతుంది .. ఆశ్చర్య పరుస్తుంది" అని చెప్పారు. 

"గ్లామర్ అంటే మనం వేసుకునే మోడ్రన్ డ్రెస్ లలో మాత్రమే కనిపించేది అనేది నేను నమ్మను. చీరకట్టులోను గ్లామరస్ గా కనిపించవచ్చు. అలాంటి చీరకట్టులోనే నేను ఈ సినిమాలో కనిపిస్తాను. ఈ సినిమా నాకు మంచి పేరు తీసుకువస్తుందనే నమ్మకం ఉంది. ఇక ఆ తరువాత సినిమాగా 'విరూపాక్ష' సెట్స్ పై ఉంది" అంటూ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News