Maharashtra: ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కిలోమీటరున్నర దూరం ఈడ్చుకెళ్లిన కారు.. వీడియో ఇదిగో!

Teenager drags traffic cop for over 1 km on cars bonnet

  • మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘటన
  • సిగ్నల్ జంప్ చేసినందుకు ఆపిన కానిస్టేబుల్
  • వివరాలు తీసుకునే ప్రయత్నం చేస్తుండగా ఢీకొట్టి వేగంగా పోనిచ్చిన డ్రైవర్
  • ఎగిరి బానెట్‌పై పడిన కానిస్టేబుల్

సిగ్నల్ జంప్ చేసిన కారును ఆపేందుకు ప్రయత్నించిన ఓ కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన డ్రైవర్ కిలోమీటరున్నర దూరంపాటు ఈడ్చుకెళ్లాడు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ముంబైకి 60 కిలోమీటర్ల దూరంలోని వాసాయి శివారు ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు.

వేగంగా దూసుకొస్తూ సిగ్నల్ జంప్ చేసిన కారును ఆపిన కానిస్టేబుల్ సోమనాథ్ చౌదరి వివరాలు తీసుకునే ప్రయత్నం చేస్తుండగా అతడిని ఢీకొట్టిన డ్రైవర్ కారును వేగంగా పోనిచ్చాడు. దీంతో ఆయన ఎగిరి కారు బానెట్‌పై పడ్డాడు. అయినప్పటికీ పట్టించుకోని నిందితుడు ఆయనను అలాగే కిలోమీటరున్నర దూరం పాటు ఈడ్చుకెళ్లాడు. అలా వెళ్తూ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోవడంతో పోలీసులకు పట్టుబడ్డాడు.

నిందితుడైన 19 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశామని, అతడికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని పోలీసులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగిపై దాడిచేయడం, హత్యాయత్నం సహా పలు కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. కారు ఉత్తరప్రదేశ్‌లో రిజిస్టర్ అయిందన్నారు.  ఈ ఘటనలో గాయపడిన కానిస్టేబుల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Maharashtra
Palghar
Car Accident
  • Loading...

More Telugu News