Supreme Court: 9 నెలల తర్వాత సుప్రీంకోర్టులో పూర్తిస్థాయికి చేరుకున్న న్యాయమూర్తుల సంఖ్య

  • కొత్తగా ఇద్దరు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
  • ఈ నెల 6న బాధ్యతలు తీసుకున్న ఐదుగురు జడ్జీలు 
  • ప్రస్తుతం సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులు
Supreme Court attains full strength of 34 as two more judges take oath

సుప్రీంకోర్టులో కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు రాజేష్ బిందాల్, అరవింద్ కుమార్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. దాంతో, సుప్రీంకోర్టులో పూర్తి స్థాయి న్యాయమూర్తుల సంఖ్య 34కి చేరుకుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందకముందు జస్టిస్ బిందాల్ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండగా, జస్టిస్ కుమార్ గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. వీరి రాకతో తొమ్మిది నెలల విరామం తర్వాత సుప్రీంకోర్టు పూర్తి స్థాయికి చేరుకుంది. అంతకుముందు ఫిబ్రవరి 6న సుప్రీంకోర్టుకు ఐదుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. 

భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ ఈ ఐదుగురు కొత్త న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో జస్టిస్‌లు పంకజ్ మిథాల్, సంజయ్ కరోల్, పీవీ సంజయ్ కుమార్, అహ్సానుద్దీన్ అమానుల్లా, మనోజ్ మిశ్రాలతో ప్రమాణం చేయించారు. డిసెంబర్ 13న సుప్రీంకోర్టు కొలీజియం వారి పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కోసం సిఫార్సు చేసింది. రాష్ట్రపతి దీనికి ఆమోద ముద్ర వేశారు.

More Telugu News