Oppo Find N2: 15న విడుదల అవుతున్న ఒప్పో ఫ్లిప్ ఫోన్

  • ఇప్పటికే చైనా మార్కెట్లో విడుదలైన ఒప్పో ఫైండ్ ఎన్ 2 ఫ్లిప్ ఫోన్
  • అక్కడ ధర సుమారు రూ.71,000
  • 15న అంతర్జాతీయంగా విడుదల
  • శామ్ సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఫోన్ కు పోటీ
Oppo Find N2 Flip folding phone confirmed to launch in India on February 15

ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫోల్డింగ్ స్మార్ట్ ఫోన్ ఈ నెల 15న భారత్ తోపాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఒప్పో యూట్యూబ్ చానల్ పై ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు. శామ్ సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 ఫోన్ కు ఒప్పో ఫ్లిప్ ఫోన్ గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ 2022 డిసెంబర్ లోనే చైనాలో విడుదలైంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇతర మార్కెట్లలో విడుదల చేయనుంది.

ఒప్పో ఫ్లిప్ ఫోన్ పై ఉండే స్క్రీన్ లోనే నోటిఫికేషన్స్ చూడొచ్చు. ఫొటోల ప్రివ్యూ చూడొచ్చు. ఇందుకోసం ఫోన్ ను తెరవాల్సిన అవసరం ఉండదు. చైనాలో విడుదలైన ఫ్లిప్ వెర్షన్ ప్రకారం చూస్తే 6.8 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోలెడ్ డిస్ ప్లే, 120 హెర్జ్ అడాప్టివ్ రీఫ్రెష్ రేట్ ఉంటాయి. ఫోన్ ను ఫోల్డ్ చేసినప్పుడు పై భాగంలో 3.62 అంగుళాల మరో స్క్రీన్ కూడా ఉంటుంది. ఈ స్క్రీన్ రిఫ్రెష్ రేటు 60 హెర్జ్ తో ఉంటుంది. ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ఎస్ వోసీ ప్రాసెర్ ఉంటుంది. 

వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ అల్ట్రావైడ్ కెమెరా, ముందు భాగంలో సెల్ఫీల కోసం 32 మెగాపిక్సల్ కెమెరా ఉన్నాయి. 4,300 ఎంఏహెచ్ డ్యుయల్ సెల్ బ్యాటరీ, 44 వాట్ సూపర్ వూక్ చార్జింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తదితర ఫీచర్లు చైనాలో విడుదల చేసిన మోడల్లో ఉన్నాయి. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ధర చైనాలో అయితే రూ.71,000గా ఉంది. 15న విడుదల చేసే వేరియంట్ లో స్పెసిఫికేషన్స్ పరంగా ఏవైనా మార్పులు ఉంటాయా? అంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే. 

More Telugu News