Devsinh: కర్నూలు జిల్లాలో కేంద్రమంత్రి దేవ్ సింహ్ పర్యటన... వైసీపీ సర్కారుపై తీవ్ర విమర్శలు

Union minister Devsinh slams AP govt
  • ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిందన్న దేవ్ సింహ్
  • లిక్కర్, ఖనిజ సంపదతో వచ్చే ఆదాయంతో ప్రభుత్వం నడుస్తోందని వెల్లడి
  • ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డుపై ఉన్నారన్న కేంద్రమంత్రి
  • ఉద్యోగుల హక్కులను హరిస్తున్నారని వ్యాఖ్యలు
కేంద్రమంత్రి దేవ్ సింహ్ చౌహాన్ నేడు కర్నూలు జిల్లాకు విచ్చేశారు. ఆదోనిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డున పడ్డారని, వారి హక్కులను హరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 10వ తేదీ వచ్చినా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. 

ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిందని తెలిపారు. లిక్కర్, ఖనిజ సంపద ద్వారా వచ్చే ఆదాయంతో ప్రభుత్వం నడుస్తోందని కేంద్రమంత్రి దేవ్ సింహ్ అన్నారు. పైగా, వలంటీర్లతో విపక్ష నేతలను భయపెడుతున్నారని మండిపడ్డారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తేనే సుపరిపాలన సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
Devsinh
BJP
Union Minister
YCP Govt
Andhra Pradesh

More Telugu News