Team India: టీ20 వరల్డ్ కప్: పాకిస్థాన్ ను 149 పరుగులకే కట్టడి చేసిన భారత అమ్మాయిలు

  • దక్షిణాఫ్రికాలో మహిళల టీ20 వరల్డ్ కప్
  • కేప్ టౌన్ లో భారత్ వర్సెస్ పాక్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
  • రాణించిన బిస్మా, ఆయేషా
Indian eves restricts Pakistan for 149 runs

దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో నేడు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ ను భారత బౌలర్లు కట్టడి చేశారు. కేప్ టౌన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 149 పరుగులు చేసింది. 

ఆ జట్టు కెప్టెన్ బిస్మా మారూఫ్ బాధ్యతాయుతంగా ఆడి 55 బంతుల్లో 68 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమె స్కోరులో 7 బౌండరీలు ఉన్నాయి. చివర్లో ఆయేషా నసీమ్ ధాటిగా ఆడడంతో పాక్ కు ఆ మాత్రమైనా స్కోరు వచ్చింది. ఆయేషా 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 43 పరుగులు చేసింది. 

టీమిండియా బౌలర్లలో రాధా యాదవ్ 2, దీప్తి శర్మ 1, పూజా వస్త్రాకర్ 1 వికెట్ తీశారు. 

అనంతరం 150 పరుగుల లక్ష్యఛేదనలో భారత అమ్మాయిలు 7 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 49 పరుగులు సాధించారు. ఓపెనర్ యస్తికా భాటియా 17 పరుగులు చేసి సాదియా ఇక్బాల్ బౌలింగ్ లో అవుటైంది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ షెఫాలీ వర్మ 28, జెమీమా రోడ్రిగ్స్ 3 పరుగుతోనూ ఆడుతున్నారు. భారత్ గెలవాలంటే 78 బంతుల్లో 101 పరుగులు చేయాలి.

More Telugu News