Chandrababu: ఏపీ నూతన గవర్నర్ కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

Chandrababu wishes AP new governor Abdul Nazeer
  • ఏపీ కొత్త గవర్నర్ గా అబ్దుల్ నజీర్
  • నిజాయతీ, చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అని కొనియాడిన చంద్రబాబు
  • ప్రజాస్వామ్య విలువలు కాపాడతారన్న నమ్మకం ఉందని వెల్లడి
  • పదవిలో విజయవంతం కావాలని ఆకాంక్ష
ఏపీ నూతన గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సయ్యద్ అబ్దుల్ నజీర్ నియమితులైన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఏపీ గవర్నర్ గా బాధ్యతలు అందుకోబోతున్న అబ్దుల్ నజీర్ గారికి హార్దిక శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. 

అబ్దుల్ నజీర్ చిత్తశుద్ధి, నిజాయతీ ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారని, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో కచ్చితంగా ఆయన ముందుంటారని భావిస్తున్నానని తెలిపారు. పదవిలో ఆయన విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు.
Chandrababu
Abdul Nazeer
Governor
Andhra Pradesh
TDP

More Telugu News