boy: తోపుడు బండిపై తండ్రిని ఆసుపత్రికి తరలించిన బాలుడు.. వీడియో ఇదిగో!

6 years old Boy Takes his Father To Hospital In Pushcart In Madhya Pradesh
  • మధ్యప్రదేశ్ లో దయనీయ దృశ్యం
  • అంబులెన్స్ కోసం ఫోన్ చేస్తే స్పందించని అధికారులు
  • గత్యంతరం లేక తోపుడు బండిని ఆశ్రయించిన తల్లీకొడుకులు
  • మూడు కిలోమీటర్ల దూరం బండిపైనే తీసుకెళ్లిన వైనం
అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆరేళ్ల కుర్రాడు పడ్డ అవస్థ చూస్తే కళ్లు చెమర్చక మానవు. అంబులెన్స్ దొరకక, ఆటోలో తీసుకెళ్లే డబ్బులేక చివరకు తోపుడు బండిని ఆశ్రయించాడు. తల్లితో కలిసి తండ్రిని తోపుడు బండిపై పడుకోబెట్టి తోసుకెళ్లాడు. మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీలో చోటుచేసుకున్న ఈ ఘటన నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటనను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.

సింగ్రౌలీకి చెందిన షా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల అనారోగ్యం ఎక్కువ కావడంతో షాను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆయన భార్య, ఆరేళ్ల కొడుకు ప్రయత్నించారు. అంబులెన్స్ కోసం ఆసుపత్రికి ఫోన్ చేయగా.. అటువైపు నుంచి స్పందనలేదు. నిరుపేద కుటుంబం కావడంతో ఆటోలో తీసుకెళ్లేంత సొమ్ము లేదు. ఏంచేయాలో తోచక చివరకు తోపుడు బండిపై షా ను ఆసుపత్రికి తీసుకెళ్లాలని తల్లీకొడుకులు నిర్ణయించారు. ఇద్దరూ కలిసి షా ను తోపుడు బండిపైకి చేర్చారు. ఆపై బండిని మూడు కిలోమీటర్ల దూరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తోసుకెళ్లారు.
boy
6 years old
Madhya Pradesh
push cart
father
hospital
ambulance

More Telugu News