Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ విస్ఫోటనం... 11 మందికి గాయాలు

Huge explosion in Visakha Steel Plant

  • పేలిన లిక్విడ్ స్టీల్
  • ఫ్లాగ్ యాష్ తొలగిస్తుండగా నీళ్లు పడడంతో పేలుడు
  • నలుగురి పరిస్థితి విషమం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో నేడు భారీ పేలుడు సంభవించింది. లిక్విడ్ స్టీల్ విస్ఫోటనం చెందిన ఈ ఘటనలో 11 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఎమ్ఎస్-2 లిక్విడ్ విభాగంలో ఫ్లాగ్ యాష్ ను తొలగించే క్రమంలో, నీళ్లు పడడంతో ఒక్కసారిగా పేలుడు జరిగింది. 

గాయపడిన వారిలో 9 మందికి స్టీల్ ప్లాంట్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, మెరుగై చికిత్స కోసం విశాఖ సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి స్టీల్ ప్లాంట్ ఆసుపత్రిలోనే చికిత్స కొనసాగుతోంది.

More Telugu News