పవన్‌‌తో ఆమంచి సోదరుడి ఫ్లెక్సీ.. జనసేనలోకి వెళ్తున్నారంటూ చర్చ

  • జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ ఫ్లెక్సీ
  • ఆమంచి కృష్ణమోహన్ సోదరుడే శ్రీనివాసరావు
  • పర్చూరు నియోజకవర్గ వైసీపీ బాధ్యుడిగా ఆమంచి
చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు (స్వాములు) జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారా? చీరాల రాజకీయాల్లో ఇప్పుడిదే చర్చ జోరుగా సాగుతోంది. కారణం ఓ ఫ్లెక్సీ. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో అభిమానులు ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. 

ఆ ఫ్లెక్సీపై జనసేనాని పవన్ కల్యాణ్, స్వాములు ఫొటోను ముద్రించారు. ఈ ఫ్లెక్సీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఆమంచి సోదరుడు త్వరలోనే జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ చర్చ మొదలైంది. కాగా, ఆమంచి కృష్ణ మోహన్ ఇటీవల పర్చూరు నియోజకవర్గ వైసీపీ బాధ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు.

Amanchi Krishna Mohan
Amanchi Srinivasa Rao
Janasena
YSRCP
Bapatla

More Telugu News