నా భర్తకు గతంలోనే వివాహం జరిగిందని నాకు తెలుసు: హన్సిక
- ఇటీవల తన పెళ్లి విషయం బయటపెట్టిన హన్సిక
- ప్రియుడు సొహైల్ ను పెళ్లాడినట్టు వెల్లడి
- అయితే సొహైల్ విడాకులకు హన్సిక కారణమంటూ ప్రచారం
- ఖండించిన హన్సిక
దీనిపై హన్సిక స్పందించింది. సొహైల్ గురించి జరుగుతున్న ప్రచారం మొదట్లో తనను ఆందోళనకు గురిచేసిందని, అయితే తల్లి సూచనలు పాటించి తమ పెళ్లి ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నానని హన్సిక వెల్లడించింది. తన భర్తకు గతంలోనే పెళ్లయిందన్న సంగతి తనకు తెలుసని వెల్లడించింది. అయితే అతడి విడాకులకు తాను ఎంతమాత్రం కారణం కాదని హన్సిక స్పష్టం చేసింది.
గతంలో తాను ఓ సంబంధంలో ఉన్నానని, అది చాలామందికి తెలిసిన విషయమేనని పేర్కొంది. మరోసారి అలాంటి రిలేషన్ షిప్ ను తాను కోరుకోవడంలేదని వెల్లడించింది. జనాల్లోకి వస్తే తన భర్తతోనే కలిసి రావాలని నిర్ణయించుకున్నానని హన్సిక వివరించింది. అందుకే, సొహైల్ తన జీవితంలో ప్రవేశించిన క్షణాలు ఎంతో మధురం అని తెలిపింది.