Rishabh Pant: రిషబ్ పంత్... ఇప్పుడు ఇలా ఉన్నాడు!

Rishabh Pant shares his photos for the first time after he injured in road accident
  • గతేడాది డిసెంబరులో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్
  • అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స
  • మొదటిసారి తన ఫొటోలను పంచుకున్న పంత్
  • కాలికి కట్టుతో దర్శనమిస్తున్న పంత్
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గతేడాది చివర్లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, తాజాగా పంత్ సోషల్ మీడియాలో తన ప్రస్తుత ఫొటోలు పంచుకున్నాడు. రోడ్డు ప్రమాదానికి గురయ్యాక పంత్ తన ఫొటోలు పంచుకోవడం ఇదే మొదటిసారి. 

ఈ సందర్భంగా పంత్....
"ఒక అడుగు... ముందుకు!
ఒక అడుగు... బలంగా!
ఒక అడుగు... మెరుగ్గా!"
....అంటూ తన ఫొటోలకు క్యాప్షన్ పెట్టాడు. కాలికి కట్టుతో, ఊతకర్రలతో ఉన్న పంత్ ను ఆ ఫొటోల్లో చూడొచ్చు. 

పంత్ గతేడాది డిసెంబరు 30న ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళుతుండగా, కారు డివైడర్ ను ఢీకొట్టి మంటల్లో చిక్కుకుంది. హర్యానా రోడ్ వేస్ కు చెందిన డ్రైవర్, స్థానికులైన ఇద్దరు యువకులు పంత్ ను కారు నుంచి బయటికి తీసుకువచ్చారు. అప్పటికే పంత్ కు తీవ్రగాయాలయ్యాయి. సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో పంత్ కు ప్రాణాపాయం తప్పింది.
Rishabh Pant
Photos
Social Media
Road Accident

More Telugu News