Karthikeya: నా కోసం సిగరెట్ మానేస్తావా .. 'బెదురులంక 2012' నుంచి టీజర్ రిలీజ్!

  • కార్తికేయ హీరోగా రూపొందిన 'బెదురులంక 2012'
  • ఆయన సరసన సందడి చేయనున్న నేహా శెట్టి 
  • గ్రామీణ నేపథ్యంలో నడిచే ప్రేమకథ 
  • సంగీతాన్ని సమకూర్చిన మణిశర్మ
Bedurulanka 2012 Teaser Released

కార్తికేయ హీరోగా 'బెదురులంక 2012' సినిమా రూపొందింది. రవీంద్ర బెనర్జీ నిర్మించిన ఈ సినిమాకి, క్లాక్స్ దర్శకత్వం వహించాడు. కార్తికేయ జోడీగా నేహాశెట్టి అలరించనుంది. ఇంతవరకూ పోస్టర్స్ ను వదులుతూ వచ్చిన ఈ సినిమా టీమ్, కొంతసేపటి క్రితం ఈ టీజర్ ను రిలీజ్ చేసింది.

ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే కథ .. లంకల గ్రామాలకి చెందిన 'బెదురులంక' అనే గ్రామంలో 2012లో నడిచే కథ. ఆ సమయంలో యుగాంతం జరగనున్నట్టుగా జోరుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారంతో ముడిపడిన సంఘటనలతో ఈ సినిమా సాగుతుందనే విషయం ఈ టీజర్ ను బట్టి అర్థమవుతోంది. 

హీరో .. హీరోయిన్ ప్రేమవ్యవహారం .. డ్రామా కంపెనీకి సంబంధించిన సందడిని కలుపుకుంటూ ఈ కథ నడుస్తుంది. లవ్ .. యాక్షన్ .. కామెడీపై కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. అజయ్ ఘోష్ .. శ్రీకాంత్ అయ్యంగార్ .. రామ్ ప్రసాద్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు.

More Telugu News