Balakrishna: మా అన్నయ్య నుంచి నేను తీసుకోనిది అదొక్కటే: 'అన్ స్టాపబుల్ 2' స్టేజ్ పై పవన్ కల్యాణ్

  • 'అన్ స్టాపబుల్ 2' షో వేదికపై బాలయ్య - పవన్ 
  • చిరంజీవి గురించి ప్రస్తావించిన బాలయ్య
  • అన్నయ్యకి మొహమాటం ఎక్కువన్న పవన్ 
  • ఆయన నుంచి హార్డ్ వర్క్ నేర్చుకున్నానని వెల్లడి
Unstoppable 2 Update

'ఆహా' ఫ్లాట్ ఫామ్ పై బాలకృష్ణ వ్యాఖ్యాతగా 'అన్ స్టాపబుల్ 2' దూసుకుపోతోంది. ఈ టాక్ షోలో ఈ సీజన్ ను పవన్ కల్యాణ్ ఎపిసోడ్ తో ముగిస్తున్నారు. పవన్ కల్యాణ్ కి సంబంధించిన రెండో ఎపిసోడ్ నిన్న రాత్రి స్ట్రీమింగ్ అయింది. రెండో ఎపిసోడ్ ఎక్కువగా రాజకీయ పరమైన అంశాలపై నడిచింది. చిరంజీవి నుంచి ఏం నేర్చుకున్నారు? ఆయన నుంచి ఏం నేర్చుకోకూడదని అనుకున్నారు? అనే ప్రశ్న బాలయ్య నుంచి ఎదురైంది. 

అందుకు పవన్ స్పందిస్తూ .. "నా చిన్నప్పటి నుంచి అన్నయ్యను చూస్తూ పెరిగాను. ఎలాంటి వనరులు లేని రోజుల్లోనే ఆయన 3 షిఫ్టులుగా పనిచేసేవారు. షూటింగ్స్ లో తగినన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు లేని రోజుల్లో ఆయన ఫైట్స్ చేసి గాయపడేవారు. ఫ్యామిలీ కోసం ఒళ్లు దాచుకోకుండా పనిచేసేవారు. ఆయన నుంచి నేను హార్డ్ వర్క్ నేర్చుకున్నాను" అన్నారు. 

ఇక ఆయనను చూసి ఇది మనకు అవసరం లేదు అనుకున్నది కూడా ఉంది .. అదే మొహమాటం. అన్నయ్యకి మొహమాటం ఎక్కువ. ఆయన చాలా విషయాల్లో మొహమాటపడుతుంటారు. మన మంచితనం ఒక్కోసారి ఇబ్బంది పెడుతుందని నేను అనుకుంటూ ఉంటాను. అందువలన ముఖస్తుతి చేసేవారిని .. మొహమాటాలను నేను దూరం పెడుతుంటాను" అని చెప్పుకొచ్చారు.

More Telugu News