భారత్ లో తొలి ఈ–టిప్పర్ వచ్చేసింది.. ఒకసారి చార్జ్ చేస్తే 250 కి.మీ. ప్రయాణం
- రెండు గంటల్లోనే ట్రక్ బ్యాటరీ వంద శాతం చార్జ్
- రూపొందించిన మేఘాకు చెందిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థ
- బెంగళూరులో ఇండియా ఎనర్జీ వీక్ 2023లో ప్రదర్శన
బెంగళూరు వేదికగా జరిగిన ఇండియా ఎనర్జీ వీక్–2023లో ప్రదర్శనకు ఉంచిన ఈ వాహనం అందరి దృష్టిని ఆకర్షించింది. రెండు గంటల్లోనే బ్యాటరీ వంద శాతం చార్జ్ అవుతుంది. ఈ–ట్రక్ పనితీరు తెలుసుకోవడానికి కంపెనీ 2022 ఏప్రిల్‌లో ట్రయల్స్ ప్రారంభించింది. ట్రయల్స్ విజయవంతం కావడంతో ట్రక్ ను మార్కెట్ లోకి ప్రవేశ పెట్టేందుకు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సిద్ధం అవుతోంది. వచ్చే నెలలో ఈ ఎలక్ట్రిక్ టిప్పర్లు అందుబాటులోకి రానున్నాయి.