Rajasthan: బైక్‌పై వెళ్తూ అమ్మాయితో రొమాన్స్.. వైరల్ వీడియో ఇదిగో!

Couple romances dangerously on a moving bike in Ajmer Rajasthan
  • రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో ఘటన
  • జంటను అదుపులోకి తీసుకుని బైక్ సీజ్ చేసిన పోలీసులు
  • చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ట్వీట్
నడిరోడ్డుపై యువతీయువకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. బైక్‌పై వెళ్తూ రొమాన్స్ చేసుకుంటున్న వీడియోలు ఇటీవల తరచూ సోషల్ మీడియాకెక్కుతున్నాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో జరిగింది. బైక్‌ డ్రైవ్ చేస్తున్న యువకుడు.. తన ప్రియురాలిని పెట్రోలు ట్యాంకుపై తనకు ఎదురుగా కూర్చోబెట్టుకుని రొమాన్స్ చేస్తూ బైక్ తోలాడు. వీరిని చూసి తోటి వాహనదారులు షాకయ్యారు. వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో వైరల్ అయింది. 

ఈ వీడియో కాస్తా పోలీసుల దృష్టిలో పడడంతో వారు వెంటనే స్పందించారు. బైక్‌పై వికృత చేష్టలకు పాల్పడిన ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు. బైక్‌ను సీజ్‌ చేసినట్టు చెబుతూ ట్వీట్ చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, గతంలో విశాఖపట్టణం, ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి.
Rajasthan
Ajmer
Bike Riding
Viral Videos

More Telugu News