Samantha: ముంబైకి మకాం మారుస్తున్న సమంత?.. కోట్ల రూపాయలతో ఇల్లు కొనుగోలు!

Samantha moving to Mumbai
  • అనారోగ్యం నుంచి కోలుకున్న సమంత
  • కెరీర్ పై పూర్తి స్థాయిలో ఫోకస్
  • రూ. 15 కోట్లతో ముంబైలో ఇల్లు కొన్న సామ్
కొన్ని రోజుల పాటు అనారోగ్యంతో బాధ పడిన సినీ నటి సమంత ఇప్పుడు మళ్లీ తన కెరీర్ పై పూర్తి స్థాయిలో దృష్టిని సారించింది. బాలీవుడ్ మూవీ 'సైటడెల్' సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. మరోవైపు సమంత గురించి ఒక వ్యాఖ్య వైరల్ అవుతోంది. సామ్ పర్మినెంట్ గా ముంబైకి మకాం మారుస్తోందనేదే ఆ వార్త. రానున్న రోజుల్లో ఆమె బాలీవుడ్ పై పూర్తి స్థాయిలో దృష్టిని సారించబోతోందని... ఈ క్రమంలో అక్కడ ఉండేందుకు ముంబైలో ఇంటిని కొనుగోలు చేసిందని సమాచారం. మూడు పడక గదులున్న ఆ ఇంటికి ఆమె రూ. 15 కోట్లు చెల్లించిందని చెపుతున్నారు. అయితే ఈ అంశంపై సమంత నుంచి కానీ, ఆమె టీమ్ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Samantha
Tollywood
Bollywood
Mumbai

More Telugu News