ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు
- హుటాహుటిన నెల్లూరు అపోలో ఆసుపత్రికి తరలింపు
- రెండు వాల్వులు బ్లాక్ అయినట్లు పరీక్షలలో వెల్లడి
- మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించే యోచన
యాంజియో పరీక్ష పూర్తయిందని, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ప్రమాదమేమీ లేదని వైద్యులు ప్రకటించారు. అయితే, మెరుగైన వైద్యం కోసం మేకపాటిని చెన్నైకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మేకపాటి ఆరోగ్య పరిస్థితిపై మరికాసేపట్లో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు.