అమెరికా ప్రథమ మహిళ ముద్దు వీడియో వైరల్..!
- ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ భర్త పెదాలను ముద్దాడిన అమెరికా అధ్యక్షుడి భార్య
- ఉభయ చట్టసభలను ఉద్దేశించి అధ్యక్షుడి ప్రసంగానికి ముందు జరిగిన ఘటన
- నెట్టింట్లో వీడియో వైరల్.. షాక్‌లో నెటిజన్లు..
ఎనిమిది సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియోను బెన్నీ జాన్సన్ అనే జర్నలిస్టు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘‘ఏంటీ.. జిల్ బైడెన్ కమల భర్త పెదాలపై ముద్దు పెట్టారా’’ అంటూ కామెంట్ కూడా జత చేశారు. నెట్టింట్లో కాలుపెడుతూనే ఈ వీడియో వైరల్ అయిపోయింది. ఇప్పటివరకూ దీనికి ఏడు లక్షల వ్యూస్ వచ్చిపడ్డాయి. నెటిజన్లు కామెంట్ సెక్షన్లో ఎమోజీలు, రకరకాల వ్యాఖ్యల వరద పారిస్తున్నారు. అసలేం జరిగిందో అర్థం కాలేదంటూ చాలా మంది ఎమోజీలు పెట్టారు. తమకు నోట మాటరావట్లేదంటూ మరికొందరు కామెంట్ చేశారు. కాగా.. ఆ సమావేశంలో జిల్ కిస్‌ను చూసిన వారెవరూ పెద్దగా స్పందించనట్టు వీడియోలో కనిపించింది. యథాప్రకారం వారందరూ చప్పట్లు కొడుతూ జిల్‌కు ఆహ్వానం పలికారు.