harirama jogaiah: చంద్రబాబు, పవన్ ల పొత్తును సమర్థిస్తున్నారా?.. హరిరామ జోగయ్యకు ఏపీ మంత్రి అమర్ నాథ్ లేఖ

ap minister gudivada amarnath writes another letter to ex minister harirama jogaiah
  • వంగవీటి హత్య వెనక చంద్రబాబు ఉన్నారని ఆరోపించారని గుర్తుచేసిన మంత్రి
  • అలాంటి వ్యక్తితో పొత్తులకు సిద్ధమైన పవన్ ను ఎలా సమర్థిస్తున్నారని ప్రశ్న
  • మాజీ మంత్రికి మరో లేఖను సంధించిన మంత్రి అమర్ నాథ్
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి హరిరామ జోగయ్య, మంత్రి అమర్ నాథ్ మధ్య లేఖల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తొలుత హరిరామ జోగయ్య మంత్రి అమర్ నాథ్ కు లేఖ రాయగా.. మంత్రి గుడివాడ అమర్ నాథ్ కౌంటర్ లేఖ రాశారు. తాజాగా మరో లేఖలో అమర్ నాథ్ మాజీ మంత్రిని నిలదీశారు. టీడీపీ, జనసేన మధ్య పొత్తును ఎలా సమర్థిస్తారని వంగవీటి రంగ హత్యను ప్రస్తావిస్తూ హరిరామ జోగయ్యను ప్రశ్నించారు.

మంత్రి అమర్ నాథ్ రాసిన రెండో లేఖలో.. గౌరవనీయులైన హరిరామ జోగయ్య గారికి అని సంబోధిస్తూ వంగవీటి మోహన రంగా గారిని చంపించినది చంద్రబాబు నాయుడేనని గతంలో హరిరామ జోగయ్య ఆరోపించిన విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి చంద్రబాబు నాయుడుతో పొత్తులకు సిద్ధమైన పవన్ కల్యాణ్ ను సమర్థిస్తారా? అని అడిగారు.

అంతకుముందు, మాజీ మంత్రి హరిరామ జోగయ్య మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు ఘాటు లేఖ రాశారు. రాజకీయాల్లో ఇంకా పైకి రావాల్సిన వ్యక్తివి అని అందులో పేర్కొన్నారు. ఓ మంత్రి పదవికి అమ్ముడుపోయి కాపుల భవిష్యత్తును పాడు చేయొద్దని హితవు చెప్పారు. పవన్ కల్యాణ్ పై అనవసరంగా బురదజల్లే ప్రయత్నం చేయొద్దని సూచించారు. దీనికి మంత్రి గుడివాడ అమర్ నాథ్ జవాబిస్తూ.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు రాయాల్సిన లేఖను పొరపాటున తనకు రాశారంటూ ఎద్దేవా చేశారు.
harirama jogaiah
amranath
Andhra Pradesh
letters
Pawan Kalyan
Chandrababu

More Telugu News