Andhra Pradesh: జగన్ ప్రకటనతో ఊపందుకున్న విశాఖ రాజధాని పనులు!

AP Officials Searching For A House in Visakhapatnam For AP CM Jagan
  • విశాఖ నుంచే పాలన సాగుతుందని జగన్ ఇటీవల ప్రకటన
  • బీచ్ రోడ్డులో ముఖ్యమంత్రి ఇల్లు
  • ఇళ్లు వెతుక్కుంటున్న మంత్రులు
ఆంధ్రప్రదేశ్ పరిపాలన త్వరలో విశాఖపట్టణం నుంచి సాగనుంది. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయమై అధికార యంత్రాంగం నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేనప్పటికీ మౌఖికంగా మాత్రం ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉండేందుకు బీచ్ రోడ్డులో అనువైన ఇంటి కోసం అధికారులు వెతుకుతున్నారని సమాచారం.

వీవీఎంఆర్‌డీఏ అధికారులు ఇటీవల ఎంవీపీ న్యాయ విద్యా పరిషత్ పక్క నుంచి రహదారి విస్తరణ పనులు చేపట్టడాన్ని బట్టి చూస్తే సీఎం నివాసం ఈ దారిలోనే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు, మంత్రులు కూడా తమకు అనుకూలమైన ఇళ్ల కోసం గాలిస్తున్నట్టు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాజధాని త్వరలోనే విశాఖకు తరలిపోతుందని, తాను అక్కడి నుంచే పాలన సాగిస్తానని జగన్ ఇటీవల ఢిల్లీలో ప్రకటించారు. ఆ తర్వాతి నుంచే విశాఖలో పనులు వేగం పుంజుకున్నాయి. అయితే, ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.
Andhra Pradesh
YS Jagan
Visakhapatnam
Beach Road
AP Capital

More Telugu News