Mahesh Babu: 'రైటర్ పద్మభూషణ్' సినిమా క్లైమాక్స్ చాలా బాగా నచ్చింది: మహేశ్ బాబు

Mahesh Babu appreciates Writer Padmabhushan movie a huge success
  • ఫిబ్రవరి 3న రిలీజైన రైటర్ పద్మభూషణ్
  • సుహాస్, టీనా శిల్పరాజ్ జంటగా షణ్ముఖ్ ప్రశాంత్ దర్శకత్వంలో చిత్రం
  • చిత్రాన్ని వీక్షించిన మహేశ్ బాబు
  • చిత్రబృందానికి అభినందనలు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన చిత్రాలకే కాదు, చిన్న సినిమాల ప్రమోషన్లకు కూడా ఎంతో సహకారం అందిస్తుంటారు. టీజర్లు, ట్రైలర్లు విడుదల చేయడం, ఆయా సినిమాలు చూసి వాటిపై తన అభిప్రాయాలను వెల్లడించడం ద్వారా తనవంతు ప్రోత్సాహం అందించే ప్రయత్నం చేస్తుంటారు. 

తాజాగా, 'రైటర్ పద్మభూషణ్' చిత్రాన్ని వీక్షించానని మహేశ్ బాబు వెల్లడించారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఎంతగానో ఆస్వాదించానని తెలిపారు. నిజంగా ఇది హృదయానికి హత్తుకునే సినిమా అని కొనియాడారు. ముఖ్యంగా, ఈ సినిమా క్లైమాక్స్ ఎంతగానో ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. తప్పకుండా కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా అని మహేశ్ బాబు అభివర్ణించారు. 

'రైటర్ పద్మభూషణ్' చిత్రంలో సుహాస్ నటనకు అభిమానినయ్యానని తెలిపారు. ఈ సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, నిర్మాతలు శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి, దర్శకుడు ప్రశాంత్ షణ్ముఖ్ తో పాటు చిత్రబృందం మొత్తానికి అభినందనలు తెలుపుతున్నట్టు మహేశ్ బాబు ట్వీట్ చేశారు. 

సుహాస్, టీనా శిల్పరాజ్, రోహిణి, ఆశిష్ విద్యార్థి తదితరులు నటించిన 'రైటర్ పద్మభూషణ్' చిత్రం ఫిబ్రవరి 3న విడుదలైంది.
Mahesh Babu
Writer Padmabhushan
Suhas
Tina Silparaj
Shanmukh Prashant

More Telugu News