Geetha Govindam: ఖుషీ తర్వాత మరో సినిమాకు అంగీకారం తెలిపిన విజయ్ దేవరకొండ

Geetha Govindam duo is back Vijay Deverakonda and director Parasuram Petla join hands for a big budget film
  • గీత గోవిందం దర్శకుడితో విజయ్ దేవరకొండ రెండో ప్రాజెక్ట్
  • నిర్మాతలుగా దిల్ రాజు, శిరీష్
  • బడ్జెట్ పై అంచనాలు భారీగానే
లైగర్ సినిమా అనంతరం విజయ్ దేవరకొండ కొంత విరామం తీసుకుని ఖుషీ సినిమా చేస్తుండగా.. ఇంతలోనే మరో చిత్రానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తదుపరి ప్రాజెక్ట్ లో విజయ్ దేవరకొండ దర్శనమివ్వనున్నాడు. వీరి కాంబినేషన్ లో గీత గోవిందం మొదటి సినిమా కాగా, ఇది రెండో ప్రాజెక్ట్ అవుతుంది. దీంతో సహజంగానే సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. 

ఈ సినిమా గురించి విజయ్ దేవరకొండ ఆదివారం ప్రకటించాడు. వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇది గీత గోవిందంకు సీక్వెల్ కాదని, తాజా స్క్రిప్ట్ తోనే ఉంటుందని నిర్మాతలు స్పష్టం చేశారు. పెద్ద బడ్జెట్ తోనే ఈ సినిమాని తీయనున్నట్టు తెలుస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ సినిమా కోసం ప్రస్తుతం విజయ్ దేవరకొండ పనిచేస్తున్నాడు. ఇందులో విజయ్ సరసన సమంత నటిస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో గతేడాది దేశవ్యాప్తంగా విడుదలైన లైగర్ బాక్సాఫీసు వద్ద అంచనాలను అందుకోని విషయం తెలిసిందే.
Geetha Govindam
Vijay Deverakonda
director parasuram
new movie

More Telugu News