Naked woman: యూపీలోని రాంపూర్ లో రాత్రుళ్లు వచ్చి కాలింగ్ బెల్ కొడుతున్న స్త్రీ!

Naked woman with mental health issues rings doorbells at night in UP Rampur
  • వంటిపై చిన్న పాటి వస్త్రం లేకుండా గ్రామ సంచారం
  • సామాజిక మాధ్యమాల్లోకి చేరిన సీసీటీవీ కెమెరా ఫుటేజీలు
  • మానసిక అనారోగ్యం వల్లే అలా చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు
అర్ధరాత్రి సమయం. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ఇంటి కాలింగ్ బెల్ మోగింది. ఉలిక్కిపడి లేచిన ఇంట్లోని వారు తలుపు తెరిచి చూడగా.. గుండె ఆగినంత పని అయింది. వంటిపై చిన్నపాటి వస్త్రం కూడా లేకుండా దిగంబరంగా స్త్రీ నిలుచుని ఉంది. ఉత్తరప్రదేశ్ లోని రామ్ పూర్ లో మిలక్ ప్రాంతంలో ఓ మహిళ కొన్ని రోజులుగా ఇదే చేస్తోంది. 

పలు ఇళ్ల ముందుకు వెళ్లి కాలింగ్స్ బెల్స్ మోగిస్తున్నట్టు, డోర్లను తడుతున్నట్టు సీసీటీవీ కెమెరాల్లోనూ రికార్డు అయింది. ఈ వీడియో ఫుటేజీలు సామాజిక మాధ్యమాలపైకి చేరాయి. దీనిపై స్థానికుడు ఒకరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇందుకు సంబంధించి శనివారం రామ్ పూర్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. సదరు మహిళను గుర్తించామని, వారి తల్లిదండ్రులతో మాట్లాడిన అనంతరం.. మానసిక అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నట్టు తెలుసుకున్నామని ప్రకటించారు. గత ఐదేళ్లుగా బరేలీలో ఆమెకు చికిత్స కొనసాగుతున్నట్టు చెప్పారు. 

సంబంధిత మహిళ మరోసారి అలా వీధుల్లోకి రాకుండా చూసుకోవాలని ఆమె తల్లిదండ్రులకు పోలీసులు స్పష్టంగా చెప్పారు. అనవసరంగా వదంతులు వ్యాప్తి చేయవద్దని ప్రజలకు సూచించారు. ‘‘రామ్ పూర్ లోని రోడ్డుపై అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో మహిళ తిరుగుతోంది. ఎవరో తెలియడం లేదు. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి? సీసీటీవీ ఫుటేజీలో ఆమె దిగంబరంగా తెల్లవారుజామున 3 గంటల వరకు తిరిగినట్టుంది. పోలీసులు ఎక్కడ ఉన్నారు అసలు? శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది?’’ అంటూ పోలీసుల తీరును ట్విట్టర్ లో ఓ వ్యక్తి ఎండగట్టాడు.
Naked woman
rings doorbells
midnight
Uttar Pradesh
Rampur

More Telugu News