Kamal Haasan: గండికోటలో భారతీయుడు2 షూటింగ్.. హెలికాప్టర్ లో స్పాట్ కి వస్తున్న కమలహాసన్

Kamal Haasan arrives at Indian 2 shooting spot in a helicopter shooting underway in Gandikota
  • ప్రత్యేక సెట్ లో బ్రిటీష్ కాలం నాటి సన్నివేశాల చిత్రీకరణ
  • తిరుపతి నుంచి గండికోటకు చాపర్ లో వచ్చి వెళ్తున్న కమల్
  • విక్రమ్ తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న అగ్ర కథనాయకుడు
‘విక్రమ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకొని మళ్లీ ఫామ్ లోకి వచ్చారు కమలహాసన్. అదే జోరులో వాయిదా పడ్డ ‘భారతీయుడు 2’ను కూడా తిరిగి ట్రాక్ లోకి తెచ్చారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ రాయలసీమలో జరుగుతోంది. కడప జిల్లా గండికోటలో వేసిన ప్రత్యేక సెట్‌లో బ్రిటీష్‌ కాలం నాటి సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కూరగాయలు, పశువుల అమ్మకాలు జరుగుతున్న మార్కెట్‌పై బ్రిటీష్ పోలీసులు దాడి చేస్తుంటే, కమల్ వారిని ఎదుర్కునే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.   

బిగ్ బాస్ తమిళ సీజన్ 6 షూటింగ్‌ను ముగించిన తర్వాత కమలహాసన్ ఇప్పుడు పూర్తిగా ఈ చిత్రంపైనే దృష్టి సారించారు. ఇక కమలహాసన్ ప్రతి రోజు తిరుపతి నుంచి హెలికాప్టర్‌లో షూటింగ్ కోసం గండికోటకు వచ్చి వెళ్తున్నారు. కమల్ తో పాటు ఆయన స్టైలిస్ట్ అమృత రామ్ కూడా ఇందులోనే ప్రయాణిస్తున్నారు. కమల్ చాపర్ లో స్పాట్ కు వచ్చిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో కమల్ ‌కు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరణ్‌తో కలిసి ఉదయనిధి స్టాలిన్‌ దీనిని నిర్మిస్తున్నారు.
Kamal Haasan
Indian 2
helicopter
Gandikota

More Telugu News