Union Budget: కేంద్ర వార్షిక బడ్జెట్... హైలెట్స్-2

  • ముగిసిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం
  • గంటన్నర పాటు సాగిన బడ్జెట్ ప్రసంగం
  • వివిధ రంగాలకు కేటాయింపులు
  • పలు స్కీముల ప్రకటనలు చేసిన నిర్మల
Union Budget speech in Parliament

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి పార్లమెంటులో గంటన్నర పాటు బడ్జెట్ ప్రసంగం వినిపించారు. బడ్జెట్ పలు రంగాలను స్పృశిస్తూ, కేటాయింపులు, వివిధ స్కీములకు సంబంధించిన వివరాలను చదివి వినిపించారు.

వివరాలు...

  • మహిళల కోసం కొత్తగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ 
  • రెండేళ్ల కాలవ్యవధితో స్కీమ్ 
  • ఇది ఫిక్స్ డ్ డిపాజిట్ పథకం 
  • డిపాజిట్ పై 7.5 శాతం సుస్థిర వడ్డీ 
  • గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసే అవకాశం 

  • సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకంలో డిపాజిట్ పరిమితి పెంపు 
  • ప్రస్తుతం 15 లక్షలుగా ఉన్న పరిమితిని ఇకపై రూ.30 లక్షలకు పెంపు 

  • కర్ణాటకలో వెనుకబాటుతనం ఎదుర్కొంటున్న ప్రాంతాల సాగు రంగానికి రూ.5,300 కోట్లు 
  • పీఎం కౌశల్ పథకం కింద 4 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ 
  • దేశీయ ఉత్పత్తుల విక్రయం కోసం యూనిటీ మాల్స్ ఏర్పాటు 
  • దేశంలో 50 నూతన విమానాశ్రయాలు, హెలీప్యాడ్ ల ఏర్పాటు 
  • దేశంలో 50 పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి నిధులు 

  • జాతీయ సహకార డేటా బేస్ కు రూ.2,516 కోట్లు 
  • కృత్రిమ మేధ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు 
  • కృత్రిమంగా ల్యాబొరేటరీల్లో వజ్రాల తయారీకి ఐఐటీలకు ప్రత్యేక నిధుల కేటాయింపు 
  • 2030 నాటికి 5 ఎంఎంటీ హైడ్రోజన్ తయారీ... జాతీయ హైడ్రోజన్ ప్రాజెక్టుకు రూ.19,700 కోట్లు 
  • లడఖ్ లో రెన్యూవల్ ఎనర్జీ వ్యవస్థ ఏర్పాటుకు రూ.20,700 కోట్లు

More Telugu News