budget: మా బడ్జెట్ ప్రాధాన్యతా అంశాలు ఇవే: నిర్మలా సీతారామన్

  • పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి
  • ప్రపంచం మందగమనంలో ఉన్నా మన దేశం వృద్ధిలో ఉందన్న మంత్రి
  • 7 అంశాల ప్రాతిపదికన బడ్జెట్
welfare is our moto says finance minister nirmala in budget speech

దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లో మంత్రి ఈ ఏడాది బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అనంతరం మంత్రి ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమానికే తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చెప్పారు. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

ప్రపంచమంతటా మందగమనం ఉన్నప్పటికీ మన దేశంలో వృద్ధి అంచనా దాదాపు 7 శాతంగా ఉందని మంత్రి నిర్మల చెప్పారు. కరోనా కష్టాల నుంచి వేగంగా తేరుకుంటున్నామని, ఈ ఏడాదితో వాటన్నింటినీ గట్టెక్కుతామని తెలిపారు. ప్రపంచ దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు.

తన ప్రసంగంలో ప్రస్తుత బడ్జెట్ ప్రాధాన్యతాంశాలను వివరించారు. సప్తరుషుల రీతిలో 7 అంశాల ప్రాతిపదికన ఈ బడ్జెట్ రూపొందించినట్టు వెల్లడించారు. సమ్మిళిత వృద్ధి, దేశంలో చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు, మౌలిక సదుపాయాలు-పెట్టుబడులు, యువశక్తి, ఆర్థిక రంగ బలోపేతం, గ్రీన్ ఎనర్జీ, రైతులు-మహిళలు-వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.

More Telugu News