Rebels Of Tupakula Gudem: ఘనంగా 'రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం' ప్రీ రిలీజ్ ఈవెంట్... ఫిబ్రవరి 3న విడుదల కాబోతోన్న చిత్రం

Rebels Of Tupakula Gudem movie set to release on February 3
  • 40 మంది కొత్త నటులతో 'రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం'
  • ముఖ్యపాత్రల్లో ప్రవీణ్ కండెల, శ్రీకాంత్ రాథోడ్, జయత్రి మకానా
  • జైదీప్ విష్ణు దర్శకత్వంలో చిత్రం
  • సంగీతం అందించిన మణిశర్మ 
ప్రవీణ్‌ కండెల, శ్రీకాంత్ రాథోడ్, జయత్రి మకానా, శివరామ్ రెడ్డి తదితర 40 మంది కొత్త నటీనటులతో రూపుదిద్దుకున్న చిత్రం 'రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం'. వారధి క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి జైదీప్ విష్ణు దర్శకత్వం వహించారు. సంతోష్ మురారికర్ కథ అందించడమే కాకుండా కో డైరెక్టర్‌గానూ పని చేశారు. 

'రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం' చిత్రం ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో ఆదివారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

డైరెక్టర్ జైదీప్ విష్ణు మాట్లాడుతూ.. "నాకు ఎంతో మంచి టీం దొరికింది. వారి వల్లే సినిమాను ఎంతో బాగా తీయగలిగాను. చిత్రబృందం అంతా నాలుగు నెలల పాటుగా నాతోనే ఉంది. ఈ సినిమా జనాలకు నచ్చుతుందని, వారికి రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. మా సినిమా ఫిబ్రవరి 2న యూఎస్‌లో విడుదలవుతోంది. ఫిబ్రవరి 3న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతోంది. థియేటర్లో ఈ సినిమాను చూడండి" అని అన్నారు. 

సంగీత దర్శకుడు, మెలొడీ బ్రహ్మ మణిశర్మ మాట్లాడుతూ... "మేం అంతా కలిసి కొత్తగా ట్రై చేశాం. ఆడియెన్స్ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.
Rebels Of Tupakula Gudem
Jaideep Vishnu
Manisharma
Pravin Kandela
Jayatri Makana

More Telugu News