Ramireddy Pratap Kumar Reddy: టీడీపీ హయాంలోనూ అవినీతి జరిగింది.. మేం కూడా సత్యవంతులం ఏమీ కాదు: ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

YCP MLA Ramireddy Pratap Kumar Reddy Says Corruption Is Not New
  • అవినీతి కొత్త కాదన్న ఎమ్మెల్యే రామిరెడ్డి
  • గతంలో బీద రవిచంద్ర రూ. 400 కోట్ల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపణ
  • పురపాలక అధికారులు మామూళ్లు డిమాండ్ చేస్తే తనకు చెప్పాలన్న ఎమ్మెల్యే
ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు కొత్తకాదని, గతంలో టీడీపీ హయాంలోనూ ఇప్పటి కంటే ఎక్కువ ఆరోపణలు వచ్చాయని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. అవినీతి కొత్త కాదని, తామేమీ సత్యవంతులం కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలోని వైసీపీ కార్యాలయంలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 

అప్పట్లో బీద రవిచంద్ర రూ. 400 కోట్ల దోపిడీకి పాల్పడ్డారని ప్రతాప్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆయనతోపాటు టీడీపీ నియోజకవర్గ బాధ్యుడు మాలేపాటి సుబ్బారాయుడు గ్రావెల్ దోపిడీకి పాల్పడ్డారన్నారు. పురపాలక అధికారులపై విమర్శలు వస్తున్నాయని, ఇకపై అలాంటి వాటికి తావులేకుండా చూస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఇళ్ల నిర్మాణాల ప్లాన్లకు పురపాలక అధికారులు మామూళ్లు డిమాండ్ చేస్తే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు.
Ramireddy Pratap Kumar Reddy
YSRCP
Nellore District

More Telugu News