Sundeep KIshan: 'మైఖేల్' ట్రైలర్ చూసి బాలకృష్ణగారు ఆశ్చర్యపోయారు: సందీప్ కిషన్

Michael movie press meet
  • సందీప్ కిషన్ తాజా చిత్రంగా 'మైఖేల్'
  • కీలకమైన పాత్రలో విజయ్ సేతుపతి
  • పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన సినిమా 
  • వచ్చేనెల 3వ తేదీన సినిమా రిలీజ్  
మొదటి నుంచి కూడా సందీవ్ కిషన్ విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'మైఖేల్' రెడీ అవుతోంది. భరత్ చౌదరి నిర్మించిన ఈ సినిమాకి, రంజిత్ జయకోడి దర్శకత్వం వహించాడు. 

వచ్చేనెల 3వ తేదీన ఈ సినిమాను తెలుగు .. తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్ మీట్ లో సందీప్ కిషన్ మాట్లాడుతూ .. " ఈ సినిమా ట్రైలర్ ను బాలకృష్ణగారు రిలీజ్ చేశారు. కంటెంట్ విషయంలో ఆయన ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేశారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరి నుంచి అదే రియాక్షన్ వస్తుందని నేను ఆశిస్తున్నాను" అన్నాడు.

"నా కెరియర్లోనే భారీస్థాయిలో రిలీజ్ అవుతున్న సినిమా ఇది. ఈ కంటెంట్ కి పాన్ ఇండియా స్థాయి ఉండటం వల్లనే, ఇతర భాషల్లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఉత్సాహాన్ని చూపించారు. నాకంటే వాళ్లు ఎక్కువగా ఈ సినిమాపై నమ్మకంతో ఉన్నారు" అని చెప్పుకొచ్చాడు. దివ్యాన్ష కౌశిక్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, వరలక్ష్మీ శరత్ కుమార్ .. విజయ్ సేతుపతి .. వరుణ్ సందేశ్ .. గౌతమ్ మీనన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.
Sundeep KIshan
Divyansha Koushik
Michael Movie

More Telugu News