Tarakarathna: తారకరత్న భార్య కుప్పం వచ్చాక బెంగళూరు తరలింపుపై తుది నిర్ణయం

Treatment for Tarakarathna continues in Kuppam hospital
  • తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్న
  • గుండెపోటుతో కుప్పకూలిన వైనం
  • కుప్పం పీఈఎస్ ఆసుపత్రిలో చికిత్స
  • బెంగళూరు నుంచి అత్యాధునిక పరికరాలతో వచ్చిన వైద్య నిపుణులు
నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ప్రస్తుతం కుప్పంలోని పీఈఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఈ ఉదయం గుండెపోటుతో కుప్పకూలిపోయారు. దాంతో కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత పీఈఎస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 

కాగా, తారకరత్నకు మెరుగైన చికిత్స కోసం రోడ్డు మార్గంలో బెంగళూరు తరలించాలని నిర్ణయించారు. అందుకోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రితో సంప్రదింపులు జరిపారు. అయితే, తారకరత్న భార్య కుప్పం వచ్చాక బెంగళూరు తరలింపుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. 

బెంగళూరు నుంచి వైద్య నిపుణులు అత్యాధునిక పరికరాలతో కుప్పం వచ్చారు. ప్రస్తుతం తారకరత్నకు కుప్పంలోనే చికిత్స కొనసాగుతోంది. అటు, తొలిరోజు పాదయాత్ర ముగిశాక తారకరత్నను పరామర్శించేందుకు నారా లోకేశ్ కుప్పంలోని పీఈఎస్ ఆసుపత్రికి వచ్చారు.
Tarakarathna
Kuppam Hospital
Wife
Nara Lokesh
Yuvagalam
TDP

More Telugu News