Amaravati: ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్

One More petition on AP capital in Supreme Court
  • శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని కోరుతూ పిటిషన్
  • పిటిషన్ వేసిన ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ
  • ఇప్పటికే సుప్రీంకోర్టులో రాజధాని అంశంపై పిటిషన్లు
ఏపీలో రాజధాని అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలయింది. రాజధాని విషయంలో శివరామకృష్ణ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజధాని అంశంపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఇదే అంశంలో అమరావతి రైతులు కూడా సుప్రీంలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు కలిపి విచారించే అవకాశం ఉంది. జనవరి 31న విచారణ జరగనుంది.
Amaravati
Andhra Pradesh
Capital
Supreme Court

More Telugu News