ముంబైలో తనకెవ్వరూ అద్దెకు ఇల్లు ఇవ్వడం లేదంటున్న నటి
- కురచ దుస్తులతో సోషల్ మీడియాలో పాప్యులర్ అయిన ఉర్ఫీ జావెద్
- ఆమె వస్త్రాదరణపై పోలీసులకు అనేక ఫిర్యాదులు
- హిందు, ముస్లిం యజమానులెవ్వరూ అద్దెకు ఇల్లు ఇవ్వడం లేదంటున్న నటి
‘ముంబైలోని ముస్లిం ఇంటి యజమానులు నేను దుస్తులు ధరించే విధానం కారణంగా అద్దెకు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. నేను ముస్లిం కాబట్టి హిందూ యజమానులు నాకు అద్దెకు ఇల్లు ఇవ్వడం లేదు. నాకు వచ్చే రాజకీయ బెదిరింపులతో కొంతమంది యజమానులకు సమస్య అయ్యింది. ముంబైలో అద్దెకు ఫ్లాట్ కనుగొనడం చాలా కష్టంగా ఉంది’ అని ట్వీట్ చేసింది.