foods: బ్రెయిన్ షార్ప్ గా పనిచేయాలంటే.. ఇవి తీసుకోవాలి..

  • శరీర జీవక్రియలు, మెదడు పనితీరుకు కావాల్సిన పోషకాలు అందించాలి
  • గుడ్డులో పచ్చసొన, హోల్ వీట్, డైరీ ఉత్పత్తులు తీసుకోవాలి
  • జింక్ గో, జిన్ సెంగ్, బ్రాహ్మి, శంకపుష్పితోనూ ఉపయోగాలు
These foods could improve your brains health

మన శరీర జీవక్రియలకు ఎన్నో రకాల పోషకాలు అవసరం. ఎవరికి వారు తమ ఆర్థిక స్తొమత పరిధిలో లభించే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా పోషకాల కొరత లేకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా మన మెదడుకు పోషకాల కొరత రానీయకూడదు. ఎందుకంటే మన ప్రతీ చర్య వెనుక మెదడు పాత్ర ఉంటుంది. 

మంచి జ్ఞాపకశక్తి ఉండాలంటే అందుకు పోషకాలే ముఖ్య పాత్ర పోషిస్తాయి. ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అంజలీ ముఖర్జీ మెదడును చురుగ్గా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంచే ఆహార పదార్థాల వివరాలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ‘‘మనం తినే ఆహార పదార్థాలు మన మెదడు నిర్మాణం, ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపిస్తాయి. కనుక మెదడుకు బలాన్నిచ్చే ఆహారాన్ని తినడం వల్ల స్వల్ప కాల, దీర్ఘకాల మెదడు పనితీరుకు సాయపడతాయి. ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచుతాయి’’ అని అంజలీ ముఖర్జీ తెలిపారు.

‘‘లెథిసిన్ ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల మెదడు పనితీరు బలపడుతుంది. గోధుమలు (హోల్ వీట్), గుడ్డులో పచ్చసొన, నట్స్ ను తీసుకోవాలి. అలాగే, కొలిన్ ను కూడా లభించేలా చూసుకోవాలి. అవకాడో, కమలా, నారింజ, ముడి ధాన్యాలు, డైరీ ఉత్పత్తుల్లో కొలిన్ ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థ మరియు జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది’’ అని అంజలీ వివరించారు. 

అలాగే, జింక్ గో, జిన్ సెంగ్, బ్రాహ్మి, శంకపుష్పి మూలికలను తీసుకోవడం వల్ల కూడా మతిమరుపు తగ్గి, మెదడు పనితీరు మెరుగుపడుతుందని ఆమె చెబుతున్నారు. అన్నిటికంటే మెదడు ఆరోగ్యానికి నిద్ర కీలకమని, రాత్రి వేళ చామంతి టీ తాగి పడుకుంటే మంచి గాఢ నిద్ర లభిస్తుందని తెలిపారు.

More Telugu News