Koti: ఆ సమయంలో జులాయిగా తిరిగాను: సంగీత దర్శకుడు కోటి

  • సాలూరు రాజేశ్వరరావు వారసుడిగా కోటి 
  • సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర 
  • పాట కోసం పరితపించానన్న కోటి 
  • అంకితభావమే తనని నిలబెట్టిందని వ్యాఖ్య 
Koti Interview

తెలుగు సినిమా సంగీతాన్ని కొత్త మలుపు తిప్పిన సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు తనయుడే కోటి. ఆయన ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి తెలుగు పాట మరింత పుంజుకుంది. కొత్త రెక్కలు విప్పుకుని ఎగిరింది. అలా తెలుగు సినిమా సంగీతంపై తనదైన మార్క్ వేసిన కోటి, తాజా ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

"సంగీతమనేది మా ఇంట ఉన్నప్పటికీ నాకు మాత్రం మెరైన్ ఇంజనీర్ ను కావాలనేది ఉండేది. అందుకు సంబంధించిన సెలక్షన్స్ లో సక్సెస్ కాలేకపోయాను. దాంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. ఆ సమయంలో ఏం చేయాలో తోచక జులాయి మాదిరిగా తిరిగేవాడిని. అలాంటి పరిస్థితుల్లోనే గిటార్ పట్టుకోవడం జరిగింది. ఇక ఆ తరువాత దానిని వదిలిపెట్టలేదు" అన్నారు. 

"చక్రవర్తిగారితో పాటు ఎంతోమంది మహానుభావుల దగ్గర పనిచేశాను. చక్రవర్తిగారు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు .. ఆయన నా దేవుడు. పాట బాగా రావడం కోసం పరితపించేవాడిని. పెద్ద సినిమా అయినా .. చిన్న సినిమా అయినా పాట కోసం అంతే అంకితభావంతో పనిచేశాను. అదే ఈ రోజున నన్ను ఈ స్థాయికి చేర్చిందని నమ్ముతున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News