Pawan Kalyan: బీజేపీతో కలిసే ఉన్నాం.. బీఆర్ఎస్ ను స్వాగతిస్తున్నాం: పవన్ కల్యాణ్

  • ఎవరు కలిసొస్తే వారితో కలిసి ముందుకెళ్తామన్న పవన్
  • కొత్త పొత్తులు కుదిరితే కొత్తగా వెళ్తామని వ్యాఖ్య
  • ఎవరూ కలిసి రాకపోతే ఒంటరిగా వెళ్తామన్న జనసేనాని
Pawan Kalyan comments on alliance with BJP

జనసేన ప్రస్తుతానికి బీజేపీతో కలిసే ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఎవరు కలిసొస్తారో వారితో కలిసి ముందుకెళతామని అన్నారు. కొత్త పొత్తులు కుదిరితే కొత్తగా ముందుకెళ్తామని తెలిపారు. ఎవరు కలిసొచ్చినా, కలిసి రాకపోయినా ముందుకెళ్తామని చెప్పారు. ఎవరూ కలిసి రాకపోతే ఒంటరిగా ముందుకెళ్తామని అన్నారు. ఎన్నికలకు చాలా సమయం ఉందని... వారం రోజుల్లో ఎన్నికలు ఉంటే పొత్తుల గురించి మాట్లాడొచ్చని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తున్నామని అన్నారు. 

విపక్షాలను అణచివేయడానికే వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1ను తీసుకొచ్చిందని విమర్శించారు. అన్ని పార్టీలు కలిసికట్టుగా పోటీ చేయాలనేదే తన కోరిక అని పవన్ చెప్పారు. ఓట్లను చీలనివ్వబోమని అన్నారు. రోజురోజుకు వైసీపీకి నమ్మకం సన్నగిల్లుతోందని వ్యాఖ్యానించారు. అందుకే తన పర్యటనకు, నారా లోకేశ్ పాదయాత్రకు ఆటంకాలను కలిగించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. 175 సీట్లలో గెలుస్తామని చెప్పుకునే వైసీపీకి అంత భయం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణలో కూడా జనసేన కీలక పాత్రను పోషిస్తుందని చెప్పారు.

More Telugu News