Surya Kumar Yadav: రిషభ్ పంత్ కోసం ఉజ్జయిని ఆలయంలో టీమిండియా క్రికెటర్ల పూజలు

Team India players offers prayers to Ujjain Lord Shiva for recovery of Rishabh Pant
  • మహాకాళేశ్వర్ ఆలయంలో సూర్య, కుల్ దీప్, సుందర్ పూజలు
  • శివుడికి భస్మ హారతిని సమర్పించిన క్రికెటర్లు
  • రిషభ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించామన్న సూర్య
టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. మరోవైపు రిషభ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ క్రికెటర్లు సూర్య కుమార్ యాదవ్, కుల్ దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ మధ్యప్రదేశ్ లోని ప్రఖ్యాత ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ తెల్లవారుజామున వీరితో పాటు భారత క్రికెట్ జట్టు స్టాఫ్ ఉజ్జయిని ఆలయాన్ని దర్శించుకున్నారు. మహా శివుడికి భస్మ హారతిని సమర్పించారు. 

స్వామివారి దర్శనానంతరం సూర్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ, రిషభ్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించామని చెప్పారు. రిషభ్ జట్టులోకి రావడం చాలా అవసరమని అన్నాడు. మరోవైపు, భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చివరి వన్డే జరగబోతోంది. మూడు వన్డేలా ఈ సిరీస్ లో ఇండియా ఇప్పటికే 2-0 ఆధిక్యతలో ఉంది.
Surya Kumar Yadav
Kuldeep Yadav
Washington Sunder
Rishabh Pant
Team India
Ujjain

More Telugu News