Asaduddin Owaisi: 70 ఏళ్లుగా మమ్మల్ని దోచుకుంటున్నారు: ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

All political parties wants Muslims as their slaves says Asaduddin Owaisi
  • ముస్లింలు బానిసలుగా ఉండాలని అన్ని పార్టీల నేతలు భావిస్తుంటారన్న ఒవైసీ
  • అగ్ర కులస్తులే రాజకీయాల్లో ఉండాలనే భావన పార్టీల్లో ఉందని విమర్శ
  • గాడ్సేపై మీ అభిప్రాయం ఏమిటని మోదీకి ప్రశ్న
దేశంలోని ముస్లింలు తమకు బానిసలుగా ఉండాలని అన్ని పార్టీల నేతలు భావిస్తుంటారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. గత 70 ఏళ్లుగా ముస్లింలను ఇదే విధంగా దోచుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు ఏకతాటిపైకి వచ్చి రాజకీయంగా ఒక లీడర్ గా ఎదగడం రాజకీయ పార్టీలకు నచ్చదని చెప్పారు. రాజకీయాల్లో అగ్ర కులస్తులే ఉండాలనే భావన ఉందని అన్నారు. ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, మైనార్టీ హిందువులు ఒక తాటిపైకి రావడం రాజకీయల పార్టీలకు నచ్చదని విమర్శించారు. 

గాంధీని చంపిన వ్యక్తి గాడ్సే అని... గాడ్సేపై మీ అభిప్రాయం ఏమిటని ప్రధాని మోదీని ఒవైసీ ప్రశ్నించారు. గాడ్సేపై సినిమాను నిర్మిస్తున్నారని... ఈ చిత్రాన్ని ఇండియాలో మీరు బ్యాన్ చేస్తారా? లేదా? అని నిలదీశారు. ఇదే సమయంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఒవైసీ ఒక విన్నపం చేశారు. నగరంలో తల్వార్లు, కత్తులతో దాడి చేస్తున్న వారిని ఒక స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసి ఉక్కుపాదంతో అణచివేయాలని కోరారు. దాడులకు పాల్పడే వారికి శాశ్వతంగా బెయిల్ రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
Asaduddin Owaisi
MIM
Narendra Modi
BJP
Godsey

More Telugu News