Singer Mangli: తన కారుపై రాళ్లదాడి పట్ల సింగర్ మంగ్లీ స్పందన

Singer Mangli reacts to Ballari car attack incident
  • బళ్లారిలో ఒక ఈవెంట్ కు హాజరైన మంగ్లీ
  • ఆమె కారుపై దాడి జరిగిందంటూ ప్రచారం
  • ఆ కారులో తాను లేనని చెప్పిన మంగ్లీ
ప్రముఖ సినీ గాయని మంగ్లీ కారుపై నిన్న రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. బళ్లారిలో నిర్వహించిన ఓ కార్యక్రమాన్ని ముగించుకుని తిరుగుపయనమవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై మంగ్లీ స్పందిస్తూ, ఇదంతా తప్పుడు ప్రచారమేనని అన్నారు. కొన్ని సోషల్ మీడియా గ్రూపులు తన ఇమేజ్ ను దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రయత్నం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తప్పుడు ప్రచారాన్ని తాను ఖండిస్తున్నానని చెప్పారు. 

బళ్లారిలో జరిగిన ఈవెంట్ పెద్ద సక్సెస్ అయిందని... కన్నడ అభిమానులు తనపై చూపించిన అభిమానం ఎంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు. కొందరు అభిమానులు తనతో సెల్ఫీలు కూడా దిగారని తెలిపారు. అధికారులు, నిర్వాహకులు కూడా తన పట్ల ఎంతో జాగ్రత్త తీసుకున్నారని చెప్పారు. త్వరలోనే తాను కన్నడ భాషను నేర్చుకుంటానని అన్నారు. దాడి జరిగిన కారులో తాను లేనని స్పష్టం చేశారు. మరోవైపు కార్యక్రమంలో కన్నడలో మాట్లాడేందుకు మంగ్లీ ఇబ్బంది పడినందుకే ఈ దాడి జరిగి ఉండొచ్చని కొందరు అంటున్నారు.

Singer Mangli
Ballari
Car Attack

More Telugu News