Vijayasai Reddy: టీడీపీ పాలనలో ఒక కులం, ఒక కుటుంబం, ఒక జిల్లాలోనే అభివృద్ధి జరిగింది: విజయసాయిరెడ్డి
- గత టీడీపీ పాలనపై విజయసాయి విమర్శలు
- గతంలో అభివృద్ధి ఎక్కడ జరిగిందో అందరికీ తెలుసన్న విజయసాయి
- అమరావతిలో ఒక్క ఇటుక కూడా పెట్టలేదని వ్యాఖ్యలు
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గత టీడీపీ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని నారా లోకేశ్ చెబుతున్నాడని, కానీ గతంలో టీడీపీ పాలనలో ఒక కులం, ఒక కుటుంబం, ఒక జిల్లాలోనే అభివృద్ధి జరిగిందన్న విషయం అందరికీ తెలుసని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
2014-19 మధ్య కాలంలో అమరావతిలో ఒక్క ఇటుక కూడా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. నాడు చంద్రబాబు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు వాటి కాగితం విలువ కూడా చేయవని విజయసాయి విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.