Babai Hotel: హీరో నితిన్ చేతుల మీదుగా మణికొండలో 'బాబాయ్ హోటల్' ప్రారంభం

Hero Nitin inaugurates Babai Hotel in Manikonda
  • ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో 'బాబాయ్ హోటల్'
  • రిబ్బన్ కటింగ్ చేసిన నితిన్
  • పసందమైన భోజనం అందిస్తామన్న హోటల్ నిర్వాహకులు
ఎంత సంపాదించినా జానెడు పొట్ట కోసం... కోటి విద్యలు కూటి కొరకే అని అంటుంటారు. అయితే, ఇప్పుడున్న హడావిడిలో భోజన ప్రియులకు పసందైన ఆహారం లభించడం కొద్దిగా కష్టమైన విషయమే. అందుకే ఆహార ప్రియులకు చక్కని వంటకాలను అందిస్తామంటూ 'బాబాయ్ హోటల్‌' హైదరాబాద్ కు వచ్చింది. ఎనిమిది దశాబ్దాల నుంచి విజయవాడలో 'బాబాయ్ హోటల్' రుచికరమైన భోజనాన్ని అందిస్తూ తన స్థాయిని పెంచుకుంటూ వచ్చింది.

ఇప్పుడు 'బాబాయ్ హోటల్' బ్రాంచ్‌ను స్టార్ హీరో నితిన్‌ చేతుల మీదుగా మణికొండలో ప్రారంభించారు. డైరెక్టర్ శశికాంత్ తన స్నేహితులతో కలిసి ఫ్రెండ్స్ ఫ్యాక్టరీని స్థాపించారు. ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలోనే ఈ 'బాబాయ్ హోటల్‌'ను హైదరాబాద్ లోని మణికొండకు తీసుకొచ్చారు.


సుదీర్ఘకాలంగా విజయవాడలో ప్రఖ్యాతి గాంచిన బాబాయ్ హోటల్‌ని మణికొండకి తీసుకురావడం సంతోషంగా ఉందని, అద్భుతమైన వంటకాలని చక్కటి శుచీశుభ్రతలతో అందిస్తామని హోటల్ నిర్వాహకులు తెలిపారు. ఒక్కసారి రుచి చూసిన వాళ్లు పర్మినెంట్‌ కస్టమర్లుగా మారడం ఖాయం అంటూ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి, డైరెక్టర్ వెంకీ కుడుముల, రామజోగయ్య శాస్త్రి, రచయిత/దర్శకుడు వక్కంతం వంశీ, నిర్మాత ఠాగూర్ మధు తదితరులు పాల్గొని బాబాయ్ హోటల్ నిర్వాహకులకు బెస్ట్ విషెస్ తెలిపారు.
Babai Hotel
Nitin
Inauguration
Manikonda
Tollywood

More Telugu News