Cricket: ఒలింపిక్స్ లో ఆరు జట్లతో టీ20 క్రికెట్!

  • అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్యకు ఐసీసీ ప్రతిపాదన
  • పురుషుల, మహిళల ఈవెంట్లు నిర్వహించాలన్న ఐసీసీ
  • 2028లో క్రికెట్ చేర్చే విషయంలో కీలక పరిణామం
Cricket in Olympic ICC proposes six team T20 contests in 2028 LA Games

ఒలింపిక్స్ లో క్రికెట్ ను ప్రవేశపెట్టాలని అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీసీ) కొన్నేళ్ల నుంచి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా లాస్ ఏంజెల్స్  వేదికగా 2028లో జరిగే ఒలింపిక్స్ లో ఆరు జట్లతో కూడిన టీ20 టోర్నీని ఏర్పాటు చేయాలని ఐసీసీ.. అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య (ఐవోసీ)కి ప్రతిపాదించింది. తద్వారా క్రికెట్ కు ప్రపంచ వ్యాప్తంగా మరింత ప్రాచుర్యం లభిస్తుందని ఐసీసీ భావిస్తోంది. ఒలింపిక్స్ లో చేర్చే కొత్త ఆటలకు సంబంధించిన జాబితాను నిర్వాహకులు మార్చిలో ప్రకటించనున్నారు. తుది జాబితాలో క్రికెట్ కు అవకాశం కల్పించాలనుకుంటే.. అక్టోబర్లో ముంబైలో జరిగే ఐవోసీ సెషన్లో దీనిపై సమీక్ష జరిపి తుది నిర్ణయం తీసుకోనున్నారు. 

కాగా, ఐసీసీ చైర్మన్ బార్కే లే నేతృత్వంలోని ఐసీసీ ఒలింపిక్ వర్కింగ్ గ్రూప్ లో వ్యూహాత్మకంగా బీసీసీఐ కార్యదర్శి జై షాకు చోటు కల్పించారు. ఈ చర్య క్రికెట్‌ను ఒలింపిక్ క్రీడగా అభివృద్ధి చేయడంలో ఐసీసీ నిబద్ధతను సూచిస్తుంది. ఇందులో ఇంద్రా నూయ్ (స్వతంత్ర డైరెక్టర్), యూఎస్ క్రికెట్ మాజీ అధ్యక్షుడు పరాగ్ మరాఠే కూడా ఉన్నారు. భారత్ ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తుంది. ఐవోసీతో చర్చల సందర్భంగా షా కచ్చితమైన ప్రభావం చూపిస్తాడని ఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్‌లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలనే భారత్ కోరికను దృష్టిలో ఉంచుకుని, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ... మన  దేశాన్ని ప్రధాన మార్కెట్‌గా గుర్తించింది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉనికిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విశ్వసించింది.

More Telugu News