Gudivada Amarnath: రెండు నెలల్లో విశాఖ పాలన రాజధాని అవుతుంది: గుడివాడ అమర్నాథ్

Within 2 months Visakha will become executive capital
  • మూడు రాజధానులపై వెనక్కి తగ్గని ఏపీ ప్రభుత్వం
  • ప్రభుత్వ కార్యకలాపాలు విశాఖ నుంచి ప్రారంభమవుతాయన్న అమర్నాథ్
  • మరోసారి చర్చను లేవనెత్తిన మంత్రి వ్యాఖ్యలు
మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. విపక్షాల నుంచి ఎంతో వ్యతరేకత ఉన్నప్పటికీ... వెనకడుగు వేయడం లేదు. తాజాగా ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి నుంచి సరిగ్గా రెండు నెలల్లో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖ అవతరిస్తుందని చెప్పారు. ప్రభుత్వ కార్యకలాపాలు విశాఖ నుంచి ప్రారంభమవుతాయని అన్నారు. గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలతో మూడు రాజధానులపై మరోసారి చర్చ ప్రారంభమయింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును మరోసారి ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఫిబ్రవరి చివర్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావచ్చు.
Gudivada Amarnath
YSRCP
3 Capitals

More Telugu News