Vaarasudu: అమెజాన్ ప్రైమ్ లో వారసుడు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Will Thalapathy Vijay Vaarasudu be streaming on Amazon Prime on February 10
  • ఓటీటీ రైట్స్ దక్కించుకున్న అమెజాన్
  • ఫిబ్రవరి 10న ప్రైమ్ లో వారసుడు విడుదల
  • అధికారికంగా ప్రకటన చేయని కంపెనీ
థియేటర్లలో విడుదలైన సినిమాలు ఏడెనిమిది వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలైతే ఇంకా ముందుగానే ఓటీటీలో విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి రిలీజ్ అయిన వారసుడు సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని విజయ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తెలుగు వెర్షన్ ను వచ్చే నెలలో ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి రెడీ అవుతోందని తెలుస్తోంది. వారసుడు సినిమా ఓటీటీ రైట్స్ ను దక్కించుకున్న అమెజాన్.. ఫిబ్రవరి 10న ఈ సినిమాను ప్రైమ్ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో వారసుడు సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారని అనధికార సమాచారం. ఇప్పటి వరకు దీనిపై అమెజాన్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.
Vaarasudu
Thalapathy
Vijay
ott
telugu movie
vijay cinima
amzon prime

More Telugu News