Rishi Sunak: సీట్ బెల్ట్ పెట్టుకోకుండా దొరికిపోయిన బ్రిటన్ ప్రధాని

UK Police Looking Into Video Of Rishi Sunak Not Wearing Seat Belt
  • కారు వెనుక సీట్లో కూర్చుని ప్రభుత్వ విధానాలపై మాట్లాడుతూ వీడియో
  • దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు
  • తప్పుగా అంగీకరించి, క్షమాపణలు చెప్పిన రిషి సునాక్
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మరో చిక్కు కొనితెచ్చుకున్నారు. సీటు బెల్ట్ పెట్టుకోకుండా కారులో ప్రయాణించారు. కారు వెనుక సీట్లో కూర్చుని దేశ అభివృద్ధికి సంబంధించి తన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాలపైకి చేరింది. దీంతో ఆయన చేసిన పనిని కొందరు పనిగట్టుకుని విమర్శించడం మొదలు పెట్టారు.

బ్రిటన్ చట్టాల ప్రకారం సీటు బెల్ట్ పెట్టుకోకపోతే 500 పౌండ్ల వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అంటే రూ.50,000. దీనిపై లాంకషైర్ పోలీసులు స్పందిస్తూ.. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, దీన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఇది పూర్తి తప్పిదంగా ప్రధాని అంగీకరించినట్టు ఆయన కార్యాలయం ప్రతినిధి ప్రకటించారు. ఇందుకు ప్రధాని రిషీ సునాక్ క్షమాపణలు చెప్పినట్టు పేర్కొన్నారు. 

‘‘ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ ధరించాలనే ప్రధాని సైతం కోరుకుంటారు. కాకపోతే నిర్ణయంలో చోటు చేసుకున్న చిన్న తప్పిదం ఇది. వీడియో క్లిప్ కోసం చాలా స్వల్ప సమయం పాటు సీట్ బెల్ట్ ను తొలగించారు. అది పొరపాటుగా ఆయన అంగీకరించారు’’ అంటూ ప్రధాని కార్యాలయం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.
Rishi Sunak
Not Wear
Seat Belt
UK
Prime Minister

More Telugu News