కేసీఆర్ బీఆర్ఎస్ సభకు కుమారస్వామి, నితీశ్ కుమార్ రాకపోవడంపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- నిన్న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ
- కుమారస్వామి, నితీశ్ ఎందుకు రాలేదని సంజయ్ ప్రశ్న
- దేశంపై కేసీఆర్ ద్వేషం పెంచుకున్నారని విమర్శ
కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సభకు కుమారస్వామి, నితీశ్ ఎందుకు రాలేదని సంజయ్ ఎద్దేవా చేశారు. రైతుబంధు పేరిట రైతులకు అందించిన సబ్సిడీని తెలంగాణ ప్రభుత్వం ఎత్తేసిందని దుయ్యబట్టారు. దేశంపై కేసీఆర్ ద్వేషం పెంచుకున్నారని మండిపడ్డారు. అగ్నిపథ్ గురించి కేసీఆర్ ఒక్కసారైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు. అగ్నిపథ్ ను సీడీఎస్ చీఫ్, దివంగత బిపిన్ రావత్ సూచించారని... ఆయన కంటే కేసీఆర్ కు ఎక్కువ తెలుసా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా పూర్తి విద్యుత్ లేదని చెప్పారు.