ఉసేన్ బోల్ట్ ఖాతా నుంచి రూ.103 కోట్లు మాయం!
- ఓ పెట్టుబడుల సంస్థలో బోల్ట్ కు ఖాతా
- 12.8 మిలియన్ డాలర్ల డిపాజిట్
- ఇటీవల చూస్తే ఖాతాలో కేవలం 12 వేల డాలర్లు!
- ఆర్థిక నేరానికి పాల్పడిన కంపెనీ మాజీ ఉద్యోగి
ఈ ఖాతాలో 12.8 మిలియన్ డాలర్లు ఉండాలి. కానీ కొన్నిరోజుల కిందట చూస్తే కేవలం 12 వేల డాలర్లు మాత్రమే ఉన్నాయి. దీనిపై స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ సంస్థ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసింది. కంపెనీ మాజీ ఉద్యోగి ఈ మోసానికి పాల్పడినట్టు వెల్లడైంది. దాంతో, ఆ డబ్బును తిరిగి ఇచ్చేయాలంటూ బోల్ట్ న్యాయవాదులు ఆ మాజీ ఉద్యోగికి 10 రోజుల గడువు విధించారు. లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఉసేన్ బోల్ట్ ఒక్కడి ఖాతాలోనే కాదు, ఇంకా 29 మంది ఖాతాల్లో నగదు మాయమైనట్టు గుర్తించారు. ఈ ఉదంతాన్ని జమైకా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని దేశ ఆర్థికమంత్రి నిగెల్ క్లార్క్ తెలిపారు. అటు, స్టాక్స్ అండ్ సెక్యూరిటీ సంస్థ తన ఖాతాదారుల ఆర్థిక భద్రతను కాపాడడంలో విఫలమైందంటూ, ప్రభుత్వం ఆ సంస్థను తాత్కాలికంగా స్వాధీనం చేసుకుంది.